గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

కరీంనగర్‌,జనవరి24(జ‌నంసాక్షి): గోదావరిఖనిలో సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ క్రీడా మైదానంలో
గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు ఎక్కడ చేయాలన్న విషయాలపై అధికారులతో చర్చించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యే విధంగా పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడాలని సూచించారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడే విధంగా విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.