గణెళిష్‌నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు -ప్రశాంతంగా జరుపుకోవాలి

-అఖిలపక్ష సమావేశంలో కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌

కరీంనగర్‌, అగస్టు 28 :జిల్లాలో సెప్టెంబర్‌ 3 న జరిగే గణెళిష్‌ నిమజ్జనం ఏర్పాట్లను విస్తృతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ రవిందర్‌ సింగ్‌, పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డిలతో కలిసి వివిద పార్టీల ప్రతినిధులతో గణెళిష్‌ నిమజ్జనం ఏర్పాట్లపై సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గణెళిష్‌నిమజ్జనానికి నాలుగు స్థలాల్లో చేయాలని నిర్ణయించామని మానకొండూర్‌ చెరువు, కొత్తపల్లి చెరువు,. చింతకుంట ఎస్సారెస్పీ కాలువ, ఈనాడు కార్యాలయం ముందుగల కాకతీయ కాలువలో నిమజ్జనం చేయనున్నామన్నారు. నిమజ్జన కార్యక్రమం సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు., ప్రతి ప్రదేశంలో కూడా ఒక జిల్లా అధికారిని ఇంచార్జిగా నియమిస్తున్నామన్నారు. మానకొండూర్‌ చెరువు వద్ద డీఆర్డీఓ వెంకటేశ్వర్‌రావు, కోత్తపల్లి వద్ద వయోజన విద్యా డీడి జయశంకర్‌, చితకుంట కాలువ వద్ద డీపీఓ నారాయణ, ఈనాడు ఆఫీస్‌ వద్ద వ్యవసాయాదికారి శ్రీదర్‌లనునియమించామన్నారు. మానకొండూర్‌ చెరువును నీటితో నింపేందుకు మంగళవారం సాయంత్రం నుంచి ఎల్‌ఎండినుంచి నీటిని విడుదల చేయాలని ఎస్సారెస్పీ ఎస్‌ఈని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే కొత్తపల్లి చెరువు నింపడం, చింతకుంట వద్ద నీటి నిల్వ ఉంచేందుకుగాను చర్యలు తీసుకోవాలని, ఈవిషయంపై ఆర్థిక మంత్రితో సంప్రదించి బుదవారం నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. నిమజ్జన స్థలాల్లో ఒక్కోచోట నాలుగు బారీ క్రేన్లను మొత్తం 16 ఏర్పాటు చేస్తామన్నారు. వినాయకులను నిమజ్జనం చేయుటకు వీలుగా క్రేన్లను అనుకూలంగా సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కవిూషనర్‌కు సూచించారు. నగరం నుంచి నిమజ్జన స్థలాల వరకు రోడ్ల వెంబడి త్రాగునీటి వసతి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. అలాగే నిమజ్జన స్థలాల్లో జనరేటర్లను ఏర్పటు చేసి లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరుగకుండా స్విమ్మర్‌లరను ఏర్పటు చేయాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు

అంతరాయం కలుగకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. ఈసందర్బంగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎలాంటి ఇబ్బందులులేకుండా అందరి సహకారంతో గణెళిష్‌ నిమజ్జనాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకోవాలన్నారు. గతంలో కన్న ఈసంవత్సరం ఎక్కువ గణపతులను ప్రతిష్టించారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మత సామరస్యాలకు పెట్టింది పేరుకరీంనగర్‌ అని ఎలాంటి విద్వంసకర సంఘటనలు అల్లర్లు జరుగకుండా చూసుకోవాల్సిన బాద్యత ఇరు మతాలవారిపై ఉందన్నారు. వినాయక నిమజ్జనానికి నీరు ముఖ్యమని అందుకోసం ఎస్సారెస్పీనుంచి 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినాయకుల ఊరేగింపు రూట్లలో గల విద్యుత్‌ లూజ్‌ లైన్లను సరిచేయాలని చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. నగర మేయర్‌ రవిందర్‌ సింగ్‌ మాట్లాడుతూ అన్ని పండుగలు సమానమేనని నగరంలో అన్ని పండుగలను విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నామని తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్బంగా నగరంలో ప్రతి గల్లీలో రోడ్ల ప్యాచ్‌ వర్క్‌లు చేస్తున్నామని మంగళవారం వరకు పూర్తవుతాయన్నారు. వినాయక చవితి బక్రీద్‌ ఓకే సారి వస్తున్నందున సామరస్యంగా నిర్వహించాలన్నారు. సానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని

రోడ్లప్రక్కనగల డస్ట్‌ బిన్‌లన్నింటిని తొలగిస్తున్నామన్నారు. పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో మొత్తం 1450 వినాయక విగ్రహాలను ఏర్పాటుచేశారని అన్ని విగ్రహాలను జియో ట్యాగింగ్‌ చేశామన్నారు. అన్ని వినాయక మండపాలను ప్రతి గంటకు ఒకసారి పోలీస్‌లు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఊరేగింపులో డీజె సౌండ్లను నిషేదించామన్నారు. సామాజిక మాద్యమాల్లో వచ్చు వార్తలను ప్రజలు నమ్మవద్దని, ఒకరినుంచి ఇంకొకరికి పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 12 గంటలవరకే నిమజ్జనం అంతా పూర్తి చేయాలని నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌ అద్యక్షుడు కర్ర రాజశేఖర్‌, విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధి నవనీతరావు, రాజేందర్‌ రెడ్డి, అధికారలుఉ పాల్గొన్నారు.