గతానికంటే భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ-స్పీకర్
హైదరాబాద్,ఆగస్టు28 : తెలంగాణ అసెంబ్లీ గతానికంటే భిన్నంగా కొనసాగుతోందని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ విూడియా సలహా కమిటీ తొలి సమావేశం అసెంబ్లీలో జరిగింది. కమిటీ చైర్మన్ సూరజ్ భరద్వాజ్ తో పాటు ఇతర కమిటీ సభ్యులు స్పీకర్ మధుసూదన చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ లకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం స్పీకర్ చాంబర్ లో సభ్యులు సమావేశమై పలు సమస్యలను మధుసూదనా చారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ప్రజలఅందరూ చూస్తున్నారని అన్నారు. ఇక సమస్యల పై ఎప్పటికప్పుడు చర్చించి విూడియా కమిటీ సహకారంతో ముందుకు సాగుదామన్నారు. ఇక శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు తరచు జరుగుతుండడం ద్వారా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయని తెలిపారు.