గతిమన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన రైల్వే మంత్రి

pssf4pj3ఢిల్లీ: గతిమన్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. ఢిల్లీ- ఆగ్రాల మధ్య గతిమన్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందించనుంది. రైల్వే చరిత్రలో మొదటి సారిగా ట్రైన్ హోస్టెస్‌లను, స్టివార్డ్‌లను గతిమన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభించామని మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడించారు. గతిమన్ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం తప్ప మిగితా అన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 100 నిమిషాల్లో 200 కిలోమిటర్లు ప్రయాణిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌ లో బయలుదేరి, 11:40 నిమిషాలకు ఆగ్రా కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటుంది.