గద్దర్ మరణం ఆట,పాట కు తీరని లోటు -వాసిరెడ్డి సీతారామయ్య
మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై డిపార్ట్మెంట్లపై అమరజీవి కామ్రేడ్ గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగినది. అందులో భాగంగా మందమర్రి డివిజన్ పరిధిలో ఏరియా వర్క్ షాప్. స్టోర్స్. సివిల్ డిపార్ట్మెంట్. కేకే ఓ సి. మరియు. కార్యక్రమాలు చేయడం జరిగింది. మందమర్రి కే కే 5గని వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధనౌక విప్లవ వీరుడు అమరజీవి గద్దర్ వర్ధంతి సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని గద్దర్ మరణంవిప్లవోద్యమానికి మరియుఆట మాట పాట కు తీరని లోటు అని అన్నారు. సింగరేణిలో గద్దర్ గారికి అభినవ సంబంధాలు కలిగిబాయి బాట కార్యక్రమంలోఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించే క్రమంలో కామ్రేడ్ గద్దర్ గారు పాల్గొనిగోలేటి నుండి కొత్తగూడెం వరకు జరిగిన ని కార్యక్రమంలో గద్దరు పాల్గొని సింగరేణి కార్మికులకు సకల సమ్మెలోతెలంగాణ ఉద్యమంలో పాల్గొని సింగరేణి కార్మికులను చేతన్య చేసి తెలంగాణ ను సాధించడం తన ఆటపాట మాట లతోప్రధాన భూమిక పోషించ డం లో గద్దర్ కృత నిశ్చయంతో పని చేసిన దిరుడు. 25 సంవత్సరాల క్రితం గద్దర్ పై అప్పుడున్న ప్రభుత్వాలు నల్ల దండు పేరుతో కాల్పులు జరిపిన వెరవకుండా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఒక బుల్లెట్నడుములో ఉన్నప్పటికీఆటపాటలతో రూథలూపించిన మహనీయుడు అని సీతారామయ్య అన్నారు గద్దర్ తన జీవితం లోఎన్నో అటు పోట్లు ఎదుర్కొని విప్లవ ఓద్య మా నికి త్యాగం చేసిన ధన్య జీవు .. ఆయన ఆశయాలను మన సింగరేణి కార్మికులం నెరవేర్చే దిశగా కార్మిక ఉద్యమాల్లో పాల్గొనాలని
సీతారామయ్యగారి పిలుపునివ్వడం జరిగినది.అదేవిధంగా మన సింగరేణి కి వచ్చినటువంటి లాభాల నుండి 35% వాటా11వ వేజ్ బోర్డు 23 నెల ఏరియర్స్ తక్షణమే ఇవ్వాలని సొంతింటి సక్కల సహకారం నెరవేర్చాలని పెర్క్స్ పై ఇన్కంటాక్స్ సింగరేణి యాజమాన్యం మే చెల్లించాలని తదితర డిమాండ్లతో రానున్న రోజుల్లో సింగరేణి కార్మికుల పోరాటాలకు సిద్ధం కావాలని సీతారామయ్య పిలుపునివ్వడం జరిగినది.అనంతరం గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ. బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమ నాధుని సుదర్శన్. బ్రాంచి సహాయ కార్యదర్శులు కంది శ్రీనివాస్. సోమిశెట్టి రాజేశం. కేకే 5 నూతనంగా ఎన్నుకోబడిన పిట్ కార్యదర్శి దేవసా నీ సాంబయ్య. పిట్టు సహాయ కార్యదర్శి గాండ్ల సంపత్. టేకుమట్ల తిరుపతి. మైన్ కమిటీ సేఫ్టీ కమిటీ నాయకులు కాసం సమ్మయ్య. కండే రాజకుమార్. గుమ్మడి సంపత్. మేకల సంతోష్. రామన్న.ఆంటోని దినేష్. ఓం నారాయణ. సాదుల సంపత్. కిరణ్. రాజేందర్.
అలీ. పంగ చంద్రశేఖర్. మాలం ప్రవీణ్. వర్క్ షాప్పిట్ కార్యదర్శి సిహెచ్ పి శర్మ. పెద్దపల్లి బానయ్య. పారిపెల్లి రాజేశం. సర్జన్. భూమయ్య. సదాశివరెడ్డి.స్టోర్ పిట్ కార్యదర్శి కందకట్ల ఓదెలు. సివిల్ ఫిట్ కార్యదర్శి జగన్.
ఓసి పిట్ కార్యదర్శి మర్రి కుమార్. కోటయ్య. కార్మికులు తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.