గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దొంగల భీభత్సం
ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు బోమ్మ తపాకీలతో బెదిర్చి రూ. లక్షలు విలువచేసే బంగారం నగలు దోచుకెళ్లారు. బాదితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.