గరిడేపల్లి స్టేట్ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

జూలై 15 (జనం సాక్షి):గరిడేపల్లి స్టేట్ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాని ఉద్దేశించి ఆ పార్టీ నాయకులు ఎస్ కె యాకుబ్ మాట్లడుతూ రైతు బందు పథకం నేరుగా రైతులకే ఇవ్వాలని అప్పుల కింది జమ చేయకుండ నేరుగా రైతు సోదరులకు ఇవ్వాలని వ్యవసాయ సీజన్ మొదలైనందున అర్హులైన రైతులు కు క్రాప్ లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకి కుడా క్రాప్ లోన్లు తో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల సైదులు, మహబూబ్ అలీ,  శ్రీను, దోసపాటి బిక్షం, యానాల సోమయ్య, మచ్చ వెంకటేశ్వర్లు,గుండెపు మట్టయ్య , జుట్టు కొండా వెంకటేశ్వర్లు, నర్సింహ,  రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area