గర్భవతులు, బాలింతలు జాగ్రతలు తీసుకోవాలి

-సర్పంచు మాధవి.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 3 (జనం సాక్షి);
గర్భవతులు బాలింతలు జాగ్రతలు తీసుకోవాలని సర్పంచ్ మాధవి అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని తిమ్మాజి పల్లె గ్రామంలో శనివారము పోషణ మాసం సందర్భంగా సర్పంచు మాధవి మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యము తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు తిన్న ఆహారంపై ఆధారపడుతుందని ఆ సమయంలో తల్లికి ఆహార పదార్థాలు ఆకుకూరలు చిరుధాన్యములు తోపాటు తల్లికి పాలు బెల్లము పండ్లు వంటివి పౌష్టికాహారం ఎంతో అవసరమని గర్భవతి అధిక మోతాదులో ఆహారం తీసుకోవాలని, ఐరన్, పోలిక్ మాత్రలను తప్పక తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాలలో ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒక పూట పౌష్టిక ఆహారం తీసుకోవాలని ,తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆకుకూరలను తీసుకోవాలని, మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, ఇంట్లో వారందరూ వారినీ ప్రేమాభిమానాలుగా చూసుకోవాలని గర్భవతులు, బాలింతలకు ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కవిత, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు మెంబర్ జయంతి, అంగన్వాడీ టీచర్ ఎస్. ఫరీదా బేగం, ఆశ వర్కర్ ఈశ్వరమ్మ ,హెల్పర్ మహేశ్వరమ్మ ,బాలింతలు, గర్భవతులు పాల్గొన్నారు.