గర్భిణి స్త్రీల జాగ్రత్తలపై ఇంటింటికి అంగన్వాడి లు అవగాహన కల్పించాలి

– జిల్లా అధికారిని వరలక్ష్మి
– అశ్వారావుపేట, సెప్టెంబర్ 3( జనం సాక్షి ) గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం కొరకు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ జిల్లా అధికారిని ఆర్. వరలక్ష్మి టీచర్లకు సూచించారు. పోషణ మాసం సందర్భంగా దమ్మపేట, అశ్వరావుపేట ఐ సి డి ఎస్ ప్రాజెక్టులకు అశ్వరావుపేట లోని తమ కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఓ రోజా రాణి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణ ప్రసవాలు జరిగేటట్లు గర్భిణీ స్త్రీలకు సూచించాలన్నారు. రక్తహీనత లేకుండా ఐరన్ మాత్రలు వాడాలని తెలిపారు.ఐటీడీఏ ద్వారా అందించే గిరి పోషణ పథకం అంగన్వాడి పిల్లలకు ఉపయోగకరంగా ఉందని, చిరుధాన్యాల మిశ్రమం అవసరమైన కొవ్వు పదార్థాలు , పిండి పదార్థాలు, విటమిన్లు ప్రోటీన్లు వంటి పోషకాలు పిల్లలకు పుష్కలంగా అందుతుందని అన్నారు. అనంతరం సిడిపిఓ రోజా రాణి మాట్లాడుతూ సెప్టెంబర్ నెల మొత్తం పోషణ మాసం లో అంగన్వాడి సెంటర్ల ద్వారా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద కిచెన్ గార్డెన్ ల ద్వారా పిల్లలకు ప్రతిరోజు అందించే పౌష్టిక ఆహారం కూరగాయలు ఆకుకూరల ద్వారా పోషకాలు అందుతున్నాయని అన్నారు. అంగన్వాడీ టీచర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే వంటకాలను తయారుచేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, అశ్వరావు పేట పంచాయతీ సర్పంచ్ రమ్య, దమ్మపేట సిడిపిఓ వి. జ్యోతి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, సౌజన్య, పద్మ, నాగమణి, శ్రీదేవి, హైమావతి, సుజాత, అశ్వరావుపేట, దమ్మపేట అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు