గర్భిణులకు అమ్మ ఒడిపై ప్రచారం
నిజామాబాద్,మే19(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులంతా కృషి చేసి, జిల్లాకు పేరుతేవాలని వైద్యాధికారులు అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లోనే అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందుబాటులోకి వచ్చిందని, దీనిపై క్షేత్రస్థాయిలో ఇంకా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏ ఒక్కరి పేరు తప్పిపోకుండా అర్హులను గుర్తించాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా గుర్తించిన గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని, గుర్తించని వారి వివరాలు నమోదు చేయాలన్నారు. పథకానికి అర్హులుగా గుర్తించిన వారి బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్, బ్యాంకు ఐఎఫ్‌సీ కోడ్‌లను సమగ్రంగా నమోదు చేస్తేనే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం
ఇచ్చే నగదు మూడు దశల్లో వారి ఖాతాలో జమ అవుతుందని, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.