గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు
` దశదిశలేకుండా సాగిన ప్రసంగం
` ఆరు గ్యారెంటీలకు కానరాని ప్రణాళిక
` రూట్ మ్యాప్ లేకుండా కాంగ్రెస్ తీరు
` ఇప్పుడే తెలంగాణ విముక్తి అన్నట్లు చెప్పడం దారుణం
` కేటీఆర్,కడియం శ్రీహరి పెదవివిరుపు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ సాధించిన ప్రగతిని పక్కన పెట్టి గవర్నర్ ప్రసంగం చేశారని అందులో కొత్తదనం లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు ఎటువంటి ప్రణాళిక గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన రూట్ మ్యాప్ గవర్నర్ ప్రసంగంలో లేదు. అది ఉంటే బాగుండేదని, కానీ గవర్నర్ చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలను చెప్పించిందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో కడియం శ్రీహరి మాట్లాడారు. తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్‌రభుత్వం అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదన్నారు. అబద్దాలను చెప్పించడం తగదన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అభివృద్దికి ఎంచుకున్న మార్గమేమిటో, పంథా ఏమిటో అన్నది గవర్నర్ ప్రసంగంలో కానరాలేదన్నారు. గవర్నర్ ప్రసంగం అంతా కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా ఉందన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారని, తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారని కడియం అన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్, ఐటీ ఎగుమతుల్లో సాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారని ఆయన అన్నారు. నిరంతర విద్యుత్‌ను ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. ఆమె స్థాయికి తగదన్నారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్ట కరమని కడియం అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని, 2014 లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తం అయ్యిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని, దళిత బంధు ప్రస్తావన లేదని, రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడ లేదన్నారు. కాంగ్రెస్ హావిూల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉందని ఆయన అన్నారు. గవర్నర్ గతంలో మాట్లాడిరది, ఇప్పుడు మాట్లాడిరది సవిూక్ష చేసుకోవాలని కడియం సూచించారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లు ఉంది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. కానీ జాతీయ స్థాయిలో అనేక తెలంగాణ అవార్డులు అందుకున్నది గవర్నర్ మరిచిపోయారు. హర్యానా, పంజాబ్ రాష్టాల్రను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచింది. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది నిజం కాదా? ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది అని శ్రీహరి తెలిపారు. ప్రజలందరూ ఇప్పుడు సంతోషపడుతున్నట్లు మాట్లాడడం సరైంది కాదు. పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారని చెప్పడం సముచితం కాదు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించు కున్నారు. 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది. ఇప్పుడు కావడమేమిటి అని కడియం ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావన లేదు. మద్దతు ధరకు రూ. 500 కలిపి ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. దానిపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హావిూలను నెరవేర్చే విధంగా కనబడడం లేదు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై మా నుండి కూడా సరైన సమాధానం ఉంటుంది అని కడియం పేర్కొన్నారు. విూడియా సమావేశంలో కడియంతో పాటు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.