గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటి
హైదరాబాద్,జనవరి20(జనంసాక్షి):గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథపై గవర్నర్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులను గవర్నర్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా కొమురవెల్లి క్రాస్‌రోడ్ వద్ద అదేవిధంగా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండగుట్టలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను గవర్నర్ పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.