గవర్నర్‌పై ఏపీ మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై వెంకయ్య ఫైర్‌

3
నెల్లూరు,జూన్‌20(జనంసాక్షి):  గవర్నర్‌ నరసింహన్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరుగుతున్న తాజా పరిణామాల్లో ఏపీ మంత్రులు గవర్నర్‌పై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలపై పాల్పడ్డ విషయం తెలిసిందే. ఏపీ మంత్రుల వ్యవహారశైలిపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. కొందరు మంత్రులు అవగాహన రాహిత్యంతో గవర్నర్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు వివాదాలుమాని అభివృద్ధిలో పోటీ పడాలని కోరారు.రాష్ట్ర గవర్నర్‌ను కించపర్చేలా మాట్లాడటం తగదని ,రాష్ట్ర మంత్రులు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడాలని, విద్వేషాలు పెంచుకోవద్దని ఆయన హితవు పలికారు. ఇకనైనా వివాదాలు చట్టానికి వదిలి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు కోరారు.  నెల్లూరులో ఆయన విూడియాతో మాట్లాడుతూ…ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదన్నారు.

పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం

నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్టులో పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజీవ్‌ ప్రతాప్‌రూడీ, మంత్రి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.కొందరు మంత్రులు సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని వెంకయ్య పరోక్షంగా ఏపీ కేబినెట్‌ మంత్రుల గురించి పరోక్షంగా విమర్శించారు. రాజ్యాంగ ¬దాలో ఉన్న గవర్నర్ను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనవసర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు వెంకయ్య సూచించారు.