గవర్నర్‌ అవమానిండం తగునా

టిడిపి తీరును తప్పుపట్టిన జగన్‌
అమరావతి,మార్చి7(జనం సాక్షి): ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం పట్ల ఏపీ సీం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సభలో టీడీపీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ’గవర్నర్‌ విూ పార్టీ కాదు.. మా పార్టీ కాదు. వయసులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ’ జగన్‌ పేర్కొన్నారు. ఈరోజు గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌..గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రసంగ ప్రతులను చింపివేశారు. సమావేశం నుంచి వాకౌట్‌ చేసి లాబీలో నిరసనలు తెలిపారు. బీఏసీ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. గవర్నర్‌ ఏ ఒక్క పార్టీకి చెందినవారు కాదని తెలిపారు. వయసును కూడా గౌరవించకుండా అవమానించారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్‌ అన్నారు.
ఉదయం ఏసీ అసెంబ్లీలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్న విషయం తెలిసిందే. గవర్నర్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.