గవర్నర్ తమిళ సై చేతుల మీదుగా

డాక్టర్ రేట్ పట్టా అందుకున్న డా గాంధీ
ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 25 (జనం సాక్షి):-
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఎన్టీఆర్ కాలనీ కి చెందిన గాంధీ నెమలికి బాటినీ విభాగంలో కాకతీయ విశ్వ విద్యాలయం డాక్టర్ రేట్ ప్రకటించారు.కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవ సందర్భంగా పీహెచ్డీ డిగ్రీ పట్టా కాన్వకేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై చేతుల మీదుగా పిహెచ్డీ పట్టాను డాక్టర్ గాంధీ నెమలి అందుకున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్య రాజన్
 డా.గాంధీ నెమలి వృక్షశాస్త్రములో  Terminalis arjuna & Tassar Silk ల పై చేసిన పరిశోధనలకు Ph.D. డిగ్రీ నీ ప్రధానం చేశారు
నెమలి లక్ష్మీ నారాయణ-సమ్మక్క దంపతులకు నాలుగవ సంతానం ఏజెన్సీ ప్రాంతంలో నుండి డాక్టర్ రేట్ పట్టాను పొంది యువతకు గాంధి ఆదర్శంగా నిలిచాడు అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని సైన్స్, ఇంజనీరింగ్ పరిశోధన బోర్డు విభాగం కార్యదర్శి ఆచార్య సందీప్ వర్మ,  విశ్వవిద్యాలయ ఉప కులపతి తాటికొండ రమేష్ మరియు
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురపనేని సాయిబాబు,లాకావత్ నర్సింహ నాయక్,ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాస్ రావు,భూక్య దేవా,అక్కినపల్లి రమేష్అజ్మిరా సురేష్,జల్లెల కొమురయ్య,
సర్పంచ్ లవుడియా లక్ష్మీ జోగ నాయక్,ఎంపీటీసీ ఏడుకొండలు,పిఎసియస్ డైరెక్టర్ దూడపక రాజేందర్,గోపిదాస్ సారయ్య,నక్క రాజు,జన్ను కర్ణాకర్,కనకం గణపతి,మామిడి అబ్బాస్,
మాల్యాల ప్రకాష్,ఈర్ల ఏడుకొండలు,ఈర్ల చిన్న బుడ్డి,బొచ్చు చోటు(దుంపెళ్లి గూడం),జన్ను రమేష్ తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ రేట్ ప్రధాన కార్యక్రమని ప్రేమతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ గాంధీ నెమలి కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు