గాంధీభవన్‌లో ఫోటో పెట్టేంత ప్రత్యేకత ఏమీ కన్పించడం లేదు

హైదరాబాద్‌: గాంధీభవన్‌ వైఎస్‌ ఫోటో పెట్టేంత ప్రత్యేకత తనకేమీ కన్పించడం లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగా అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారని వైఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అనేకం వివాదాస్పదమయ్యాయని ఆయన అన్నారు. తన దృష్టిలో అంజయ్య, వైఎస్‌ లిద్దరూ కాంగ్రెస్‌ ముఖయమంత్రులేనని దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైద్య సీట్లు ఎందుకు పెరగలేదో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని ఆయనన్నారు. ఆయన ఈరోజు ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. డీగ్రీ కళాశాల విద్యార్థులో వ్యక్తిత్వ వికాసం పెంపోందిచే విధంగా  నూతప క్యాలెండర్‌ను రూపొందిచినట్లు ఆయన తెలియజేశారు. డిగ్రీ కళాశాలలన్ని ఒక వ్యవస్థలా ఏర్పండేందుకు చర్యలు తీసుకుంటున్నమని రాజనర్సింహ అన్నారు. ప్రతి అనుబంధ కళాశాల నాక్‌ గుర్తింపు పొందేలా కృషిచేయాలన్నారు.