గాంధీభవన్‌ ముట్టడికి ఓయూ జేఏసీ యత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చాకో చేసిన వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ మండిపడంది. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ఓయూ జేఏసీ నేతలు యత్నించారు. చాకో దిష్టిమ్మను దహనం చేసి కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.