గాజాలో ఆకలి కేకలు

` ఆహారం కోసం గోదాముల్లో చొరబడుతోన్న వేల మంది నిస్సహాయులు
` అక్టోబరు 7న హమాస్‌ దాడిని గుర్తించడంలో ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ విఫలమైంది
` భద్రతాధికారులు దాడి గురించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు
` సొంత సైన్యంపై నెతన్యాహూ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు
గాజా(జనంసాక్షి): గాజాను నిర్బంధించిన ఇజ్రాయెల్‌ దళాలు.. భూతల దాడులను ఉద్ధృతం చేశాయి. దీంతో దేశం విడిచి బయటకు వెళ్లలేక.. అక్కడ సురక్షితంగా తలదాచుకోలేక 23 లక్షల మంది గాజా ప్రజలు మూడు వారాలుగా నలిగిపోతున్నారు.ముఖ్యంగా అన్నపానీయాలతోపాటు ఇతర అత్యవసర సామగ్రి లేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వీరికి సాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి.. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడిరచింది.ఇజ్రాయెల్‌` హమాస్‌ల మధ్య జరుగుతోన్న పోరు.. మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేల మంది గాజావాసులకు అత్యవసర వస్తువులను పాలస్తీనాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయ, మానవతా విభాగం అందిస్తోంది. దాని ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను వసతి గృహాలుగా మార్చింది. వీటిల్లో వేల సంఖ్యలో పునరావాసం పొందుతున్నారు. అయితే, ఇరువైపుల దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న గాజావాసుల కోసం ఈజిప్టు నుంచి పరిమిత స్థాయిలో సాయం అందుతోంది. ఈ క్రమంలో దీన స్థితిని ఎదుర్కొంటున్న వేలాది మంది నిస్సహాయులు.. గోదాంలలోకి చొరబడి గోధుమలు, పిండి, ఇతర నిత్యవసర వస్తువులు తీసుకెళ్లినట్లు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ వెల్లడిరచింది.ఇలా గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని.. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ గాజా డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నారు. భయం, ఆందోళన, నిరాశతో ఉన్న గాజావాసుల్లో ఓపిన నశిస్తుందనడానికి ఇది అద్దం పడుతోందన్నారు. ఈజిప్టు నుంచి ట్రక్కుల్లో వస్తోన్న మానవతాసాయం సరిపడ స్థాయిలో లేదని.. మార్కెట్లో వీటి నిల్వలు నిండుకుంటున్నాయని అన్నారు. మరోవైపు ప్రత్యేక షెల్టర్లు కిక్కిరిసిపోతున్నాయని.. ఒక్కో షెల్టర్లో సాధారణం కంటే 12 రెట్లు ఎక్కువ జనం తలదాచుకుంటున్నారని అన్నారు.ఇజ్రాయెల్‌`పాలస్తీనా మధ్య జరుగుతోన్న యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ రక్తపాతానికి ముగింపు పలకాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు. గాజాలో పరిస్థితులు గంట గంటకు క్షీణిస్తున్నాయని.. అంతర్జాతీయ మానవతా సాయం అవసరమైన వేళ ఇజ్రాయెల్‌ సైనిక దాడులు పెరగడం పట్ల చింతిస్తున్నానని అన్నారు.
సొంత సైన్యంపై నెతన్యాహూ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు
హమాస్‌పై ఇజ్రాయెల్‌ ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే హమాస్‌ కీలక కమాండర్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ దళాలు ప్రకటించాయి.మరోవైపు తాము రెండో దశ యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతా బలగాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అక్టోబరు 7న హమాస్‌ దాడిని గుర్తించడంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ విఫలమైందని, భద్రతాధికారులు దాడి గురించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని నెతన్యాహూ ట్వీట్‌ చేశారు. దీనిపై కేబినెట్‌ సహచరులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. భద్రతా బలగాలకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్న ఆయన, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.’’ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా బలగాలపై నింద మోపుతూ.. ప్రధాని బాధ్యతారాహిత్యంగా వ్యవరిస్తున్నారు. హమాస్‌, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు పోరాడుతున్నాయి. వాళ్లకు మద్దుతుగా ఉండాల్సిన సమయంలో, సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు’’ అని ఇజ్రాయెల్‌ ప్రతిపక్ష నేత jైుర్‌ లాపిడ్‌ అన్నారు.మరోవైపు గాజాలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఆల్‌`షిపాకు అతి సవిూపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు చేసింది. హమాస్‌ ఉగ్ర కార్యకలాపాలకు ఆసుపత్రిని ప్రధాన కార్యాలయంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్‌ ఆరోపించిన కొద్ది గంటల్లోనే అక్కడికి సవిూపంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆసుపత్రికి వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8 వేలకు చేరిందని గాజాలోని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ దాడులతో పాలస్తీనాలో పాలనా వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.