గాజా గజగజ..
` సేఫ్ జోన్లనూ వదలని ఇజ్రాయెల్
` ఎక్కడపడితే అక్కడ బాంబుల వర్షం
` సాయం కోసం లాక్షలాది మంది పాలస్తీనియన్లు ఎదురుచూపులు
గాజాస్టిప్ర్ (జనంసాక్షి): హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా అల్ల కల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నా రు. హమాస్`ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు శరణార్థులుగా మారారు. దక్షిణ గాజా సురక్షితమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. గాజాలో సురక్షితమైన జోన్లు ఏవీ లేవని ఇ జ్రాయెల్ మిలటరీ అధికారిక ప్రతినిధి నిర్ దినార్ శుక్రవారం విూడియాతో చెప్పారు. ఇజ్రాయెల్ బాంబు దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ’దక్షిణ గాజాలో పాలస్తీనియన్లు ఉండలేని పరిస్థితి ఏర్పడిరది. గాజా అంతటా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాకు వెళ్లినవారంతా మళ్లీ తిరిగి వెనక్కి వస్తున్నారు’ అని ఐరాస మానవ హక్కుల అధికార ప్రతినిధి రవీనా శ్యామ్‌దాసానీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు సమకూర్చిన సామగ్రితో కూడిన వాహనాలు ఈజిప్టు`గాజా సరిహద్దులోని రఫా క్రాసింగ్ వద్ద బారులు తీరాయి. దాదాపు 200 ట్రక్కుల్లో మూడు వేల టన్నులకుపైగా సామాగ్రి అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఈ ట్రక్కులు శనివారం లేదా ఆ తర్వాత గాజాలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటో నియె గుటెర్రస్ తాజాగా తెలిపారు. సహాయ సామాగ్రి వీలైనంత త్వరగా గాజాకు చేరుకునేలా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు ఐరాస మానవతా వ్యవహారాల విభాగం ప్రతినిధి ఒకరు విూడియాతో చెప్పారు. గాజాలోని ఖాన్‌యూనిస్‌లో పిల్లలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారు. గాజా దక్షిణ సరిహద్దు వెంబడి వందలాది మందిని అంబులెన్సుల్లో స్థానిక దవాఖానకు తరలిస్తున్నారు. గాజాలో రెండో అతిపెద్ద దవాఖాన ‘నాజర్ హాస్పిటల్’ క్షతగాత్రులతో, శరణార్థులతో నిండిపోయింది.