గాలికుంటు నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి -పశు వైద్యాధికారి డాక్టర్ కె. శంకరయ్య.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 10 (జనం సాక్షి);సీజనల్ లో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండి గాలికుంటు నివారణ టీకాలను తమ పశువులకు తప్పనిసరిగా వేయించుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పశువైద్యాధికారి డాక్టర్ కె. శంకరయ్య అన్నారు. గురువారం గద్వాల మండల పరిధిలోని కురువపల్లి, పరమాల గ్రామాలలో గాలికుంటు నివారణ, ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తుగా నివారణ టీకాలు వేయించుకోవాలని, ఉచిత నట్టల నివారణ మందులను కూడా పంపిణీ చేస్తున్నామని, ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేస్తూ, ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. గద్వాల మండలంలో తెల్ల పశువులు 258, గేదెలు 87, మొత్తం పశువులు 345 పశువులకు టీకాలు వేసి, ఉచిత నటల నివారణ మందులను పంపిణీ చేసినట్లు, ఇందులో మొత్తము 34 పసుపోషకులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జే వి వో లు మాధవిలత, ఉమాదేవి, వెటర్నరీ అసిస్టెంట్ శశి కుమార్, ఓ ఎస్ లు కృష్ణయ్య, రాముడు, గోపాలమిత్రాలు ప్రభాకర్ ,నరసింహ, జహంగీర్, పి. రాజు తదితరులు పాల్గొన్నారు.