‘గాలి’ ఆస్తుల్ని రూ.884 కోట్లు అటాచ్‌మెంట్ చేసిన ఈడి
హైదరాబాద్, డిసెంబర్ 5 (జనంసాక్షి) : గనుల కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎంసీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ ఇన్‌ఫోర్స్ మెంట్
డైరెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు చెందిన 88 కోట్ల 41 లక్షల 30 వేల షేర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. మొత్తం 884 కోట్ల రూపాయలు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఇంతకుముందెన్నడు ఈ స్థాయిలో ఆస్థులను జప్తు చేసిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల్లోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ రాష్ట్ర సరిహద్దులు చెరిపేసిందని, సుంకులమ్మ దేవాలయాన్ని కూర్చేశారని ప్రతిపక్షాలు వివిధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. చివరికి కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ ప్రారంభించి, గాలి జనార్దన్‌రెడ్డిని, ఆయన అనుయాయిలను అరెస్టు చేసింది. దర్యాప్తు ప్రక్రియ కొలిక్కివచ్చిన దశలో అక్రమంగా సంపాదించిన మొత్తం అటాచ్ చేస్తున్నట్లు ఈడీ పేర్కొంది.