గిరిజనులకు10% రిజర్వేషన్లు,దళితబందు తరహాలో గిరిజనబంధు ప్రకటించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు.

నెరడిగొండ సెప్టెంబర్18(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గిరిజన ఆదివాసీల కోసం 50కోట్లతో కొమరం భీం,బంజారా భవనాల ను నిర్మాణం పూర్తి చేసి శనివారం రోజున హైదరాబాద్ లో భవనం ప్రారంభోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో సిఎం కేసీఆర్ గిరిజనులకు10 శాతం రిజర్వేషన్ల తోపాటు త్వరలోనే భూమి లేని గిరిజనులకు దళితబందు తరహాలో గిరిజన బంధుపథకం ప్రవేశ  పెడుతామని పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కును కల్పిస్తామని ప్రకటించిన కేసీఆర్ ముఖ్యమంత్రికి యావత్ గిరిజన జాతి తరుపున గిరిజన లంబాడి ఐక్యవేదిక అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ ఆదివారం రోజున సిఎం కెసిఆర్  ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే గిరిజన రిజర్వేషన్ కోసం సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు లకు రాష్ట్ర ఆదివాసి గిరిజన లంబాడి ఐక్యవేదిక తరపున ప్రత్యేక ధన్యవాదాలని పేర్కొన్నారు.
Attachments area