గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 7 (జనం సాక్షి): గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షులు అడ్వకేట్ నగేష్ రాథోడ్ అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణం బంజారా భవన్ నందు సేవాలాల్ ఫౌండేషన్ చైర్మన్ గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షులు అడ్వకేట్ నగేష్ రాథోడ్ ఆధ్వర్యంలో గిరిజన సంఘాల ముఖ్య నాయకులు ఇటీవల మదర్ తెరిస్సా జాతీయ అవార్డు గ్రహించిన మధు నాయక్, ఉమ్మడి నల్గొండ జిల్లా జూవైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ డాక్టర్ మోహన్ రావ్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అడ్వకేట్ నగేష్ రాథోడ్, వెంకటేశ్వర్లు నాయక్ లు మాట్లాడుతూ పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా గ్రామపంచాయతీ కల్మెట్ తండా కు చెందిన గిరిజన శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు నాయక్ కు సోషల్ సర్వీస్ విభాగంలో ఫిలిం త్రోఫిక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మదర్ తెరిస్సా జాతీయ ప్రతిభ అవార్డు విజయవాడలో అందుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ గా ఎన్నికైనందుకు గాంధీనగర్ తండా దొండపాడు కు చెందిన గుగులోతు మోహన్ రావ్ నాయక్ లను ఈ సందర్బంగా ఘనంగా సన్మానించామని, గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్థికంగా వెనకబడి ఉన్న సేవా రంగంలో ముందు వరుసలో ఉండి నిరుపేదలకు సేవా చేయడం గొప్ప విషయమని, పేద కుటుంబంలో పుట్టి పేద ప్రజలకు సేవలు అందిస్తున్న మధు నాయక్ కు మదర్ థెరిస్సా జాతీయ ప్రతిభ అవార్డు రావడం అదేవిదంగా డాక్టర్ మోహన్ రావ్ జిల్లా జూవైనల్ బోర్డు మెంబర్ గా ఎన్నిక కావడం మా బంజర జాతికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సేవాలాల్ ఉత్సవ కమిటీ కన్వినర్ బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్, గిరిజన నాయకులు నాగరాజు నాయక్, బాణావత్ తులిసిరామ్ నాయక్,మోహన్ రావు నాయక్, రంగా నాయక్,వెంకటేశ్వర్లు నాయక్, రమేష్ నాయక్,తుల్సాయ నాయక్, నాగు నాయక్, గోపి నాయక్, పాండు నాయక్, భీమా నాయక్, రామా నాయక్, పుల్సింగ్ నాయక్, పికా నాయక్ తదితరులు పాల్గొన్నారు