గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు కెసిఆర్: అఖిలభారత బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షా నాయక్
తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 18 (జనంసాక్షి): గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అని ఆలిండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షా నాయక్ అన్నాడు. ఆదివారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిక్షా నాయక్ హాజరై మాట్లాడుతూ కేసీఆర్ గిరిజనుల పాలిట దైవమని కొనియాడారు. శనివారం హైదరాబాదులో నిర్మించిన బంజారా భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇవ్వడంతో గిరిజన జాతి ఎంతో సంతోషంగా ఉన్నదని, ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల గిరిజన జాతి మొత్తం టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికి రుణపడి ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య ,సర్పంచులు చందూలాల్ నాయక్, రామ్ సింగ్ బిచ్చా నాయక్ ,జవహర్లాల్ నాయక్ ,హథిరాం నాయక్, హనుమాన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న గిరిజన నాయకులు