*గిరిజనుల రిజర్వేషన్ 6 నుంచి 12 శాతానికి పెంచాలని డిమాండ్**

*రిజర్వేషన్ల తర్వాతే బంజారా భవన్ ప్రారంభించాలి* 
 
– *పొడుభూముల పరిష్కరం ఏమైంది* 
 
– *పొడుభూముల పై జరుగుతున్న ఆగడాలు అపాకపోతే పోరాటం తప్పదు** 
– **గ్రేటర్ వరంగల్ ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షులు ధారవత్ బాలు నాయక్* 
*దేవరుప్పుల, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):** హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో బంజారా, ఆదివాసీ వర్గాల కోసం సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీం ఆదివాసీ భవన్ లను ప్రభుత్వం నిర్మించింది. 50 కోట్లకు పైగా వ్యయంతో కొద్ది రోజుల క్రితమే వాటి నిర్మాణం పూర్తైంది. ఈ భవనా లను తెలంగాణ జాతీయ సమైక్యతా వబ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. అయితే తమకు కావల్సింది భవనాలు కాదని… అంతకంటే ముఖ్యమైన రిజర్వేషన్లను పెంచడం కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ధారవత్ బాలు నాయక్ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోపాయికారి ఒప్పంద వైఖరి నశించాలని గిరిజన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 6 నుండి 12 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లను పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలతో కాలం గడుపుతూ గిరిజన సమాజానికి, గిరిజన యువతకు,తప్పుదోవ పట్టిస్తుందని…. నిరుపేద వారికి పోడు భూముల పరిష్కరం చేస్తామన్న కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు చెయ్యలేదని బాలు నాయక్ ప్రశ్నించారు. వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని  గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడిని ఆపాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.