గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి మృతి
ఖమ్మం: దమ్మపేట మండలంలోని చీపురుగూడెం గిరిజన ఆశ్రమపాఠశాలో ఓ బాలుడు మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి నిన్న రాత్రి టీవీ వీక్షించిన అనతరం సహచరులతో కలసి నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున పీఈటీ బాలున్ని లేపేందుకు యత్నించగాడు. అయితే అతనిలో చలనం లేకపోవటంతో దమ్మపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాఉ. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మీతి చెందినట్లు చెప్పాను. మీతికి గల కారణాలు తెలియరాలేదు.