గిరిజన తండాలకు మహర్దశ
కొత్తగా ఏర్పడ్డ పంచాయితీల్లో గిరిజన సర్పంచ్‌లు
ఆదిలాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచాయితీలుగా మారాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకాశం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 3 ననుంచి 15వరకు గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలున్నాయి. గిరిజన గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గిరిజన తండాలు 5 నుంచి 10కి.మి. దూరంలో ఉండడంతో.. గ్రామ పంచాయతీలో పనులుంటే.. ఒక రోజంతా సమయం వృథా అవుతోంది. వివిధ రకాల పనుల కోసం గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లటం కష్టంగా ఉండడంతో.. తాజాగా ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చారు. దీంతో ఈ తండాల్లో వచ్చే ఎన్నికల్లో అనేకమంది గిరిజనులు సర్పంచ్‌లు కాబోతున్నారు. గిరిజన తండాలు గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు చేయడంతో.. పరిపాలన సౌలభ్యం కలగనుంది. మరికొందరికి రాజకీయంగా పలు పదవులు లభించనున్నాయి. సర్పంచి, వార్డు సభ్యులు, కార్యదర్శి స్థానికంగా ఉండటంతో.. పర్యవేక్షణ పెరుగుతుంది. వివిధ రకాల ధృవపత్రాలపై సంతకాలకు కార్యదర్శి కోసం వేరే గ్రామానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు త్వరిత గతిన పరిష్కారం కానున్నాయి. గ్రామాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది. గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తండాలు, గూడెం, గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మార్చేసింది. హైకోర్టు తీర్పు దరిమిలా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్దం కావాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్‌ఇనకలు
ముగిసిన వెంటనే పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. మూడునెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇపపటికే ఆదేశించింది. వచ్చే జనవరిలోగా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల పక్రియ కొనసాగించనున్నారు. 500ల జనాభ కలిగిన గిరిజన తండాలు, గూడాలను కలిపి ఒక గ్రామ పంచాయతీగా గుర్తించారు. మూడు కిలో విూటర్ల పరిధిలో క్లస్టర్ గ్రామాలను కలిపి 500జనాభ గల వాటిని ఒక గ్రామ పంచాయతీగా చేశారు. పాత వాటితో పాటు కొత్తగా ఆవిర్భవించిన గ్రామ పంచాయతీలకు కూడా ఒకే సారి ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై 2018 నాటికి పాత గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసింది. హైకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువులోపే ఎన్నికలు నిర్వహించేందుకు కొత్తగా వచ్చే సర్కారు సిద్ధం కావాల్సి ఉంది.