*గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి అని.గిరిజన మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్ నాథ్ నాయక్.*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి అని గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్ నాథ్ నాయక్ అన్నారు.శనివారం నాడు నేరేడుచర్ల పట్టణ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసినగిరిజన మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళిత గిరిజనులు గర్వపడేలా బిజెపి వారికి అత్యున్నత పదవి అయినా రాష్ట్రపతి పదవి ఇవ్వటమే అందుకు ఉదాహరణ ఆయన అన్నారు.తండాల్లో గ్రామాల్లో రోడ్లు విద్యుత్తు లకు సబ్ ప్లాన్ నిధుల నుండి అభివృద్ధికి కేంద్రం కేటాయిస్తుందని,విద్య అర్హత లేని వారికి ఏకలవ్య స్కూల్స్ పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మోడీ ప్రభుత్వంలో అనగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని అందరికీ అవకాశం కల్పిస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు 12 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని 8 సంవత్సరాలు గడిచినప్పటికీ కుడ గిరిజనుల మభ్యపెడుతుందన్నారు.ధరణి వల్ల ఎస్సీ ఎస్సీ బీసీ రైతులకు అన్యాయం జరుగుతుందని సాధారణ వ్యక్తులు నష్టపోతున్నారని ధరణి కేవలం భూస్వాములకు లాభం చేకూర్చేలా ఉందని అన్నారు.కెసిఆర్ వల్ల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని అన్నారు.బిజెపి జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి మాట్లాడుతూ 2014లో కేసీఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని వాగ్దానం చేసి నేటి కల్పించలేదని దళిత బంధుకు ఒక లక్ష 70 వేల మంది అర్హులు ఉండగా ఇంతవరకు కనీసం 10,000 మంది కూడా ఇవ్వలేదని మునుగోడు ఉప ఎన్నిక లో భాగంగా గిరిజన బంధు ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని, ప్రజలు టిఆర్ఎస్ కి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను బిజెపి పార్టీ సెమీఫైనల్గా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తే మొదట ఉచిత విద్య వైద్యం రాష్ట్రంలో అమలు చేస్తుందని ఆయన అన్నారు.సమావేశానికి అధ్యక్షత దారావత్ బాల్ సన్ నాయక్ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షులు,అతిధులు బిక్కు నాథ్, జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు,హుజూర్నగర్ నియోజకవర్గం బాల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయకుమార్ యాదవ్ పట్టణ అధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి గుండెబోయిన వీరబాబు,జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్,జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తూరు వెంకటేశ్వర్లు, రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి బాధావత్ బాలాజీ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిజన మోర్చా పూల్ సింగ్ నాయక్ ,సంతోష్ నాయక్, ఇస్లావత్ బాలాజీ నాయక్,పట్టణ మండలం ప్రధాన కార్యదర్శులు కోనతం నాగిరెడ్డి, పగిడి శ్రీనివాస్, మోర్చ్ ల అధ్యక్షులు తాళ్ల నరేందర్ రెడ్డి, ఉప్పెల్లి ప్రవీణ్, చింతలచెరువు సతీష్ తదితరులు పాల్గొన్నారు.