గిరిజన భవన్ కు శంఖుస్థాపన చేసిన ఎం.ఎల్.ఏ.భూపాల్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నల్గొండ పట్టణం గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ గృహాల వద్ద ఒక ఎకరం స్థలం లో ఒక
కోటి 10 లక్షల వ్యయం తో నిర్ర్మించ నున్న గిరిజన భవన్ కు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహాయ సంస్థ చైర్మన్ రామచంద్రనాయక్ తో కలిసి ఆదివారం శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని ,గిరిజన విద్యార్థిని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని, ప్రతి తండాను గ్రామపంచాయతీ చేసిందని,
గిరిజన రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
గిరిజనలందరు కలిసి ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,ప్రవీణ్ నాయక్, హేమ నాయక్, బాలాజీ నాయక్ అమర్ సింగ్ కోనేటి నరసింహరుద్రాక్ష వెంకన్న, కౌన్సిలర్లు పున్నా గణేష్ ప్రదీప్ నాయక్, ఖయ్యుమ్ బేగ్ సమీ యొద్దీన్,బోయినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు