గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిపిన సైకో సర్వేశ్వరరావు.

 

-నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తుల డిమాండ్.

పినపాక, సెప్టెంబర్ 4(జనంసాక్షి):-

పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మద్దులగుడెం గ్రామంలో
గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది. బాధిత మూగ గిరిజన యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెబుతున్న కథనం పూర్వాపరాల్లోకి వెళితే.. సింగిరెడ్డిపల్లికి చెందిన ఓ గిరిజన మూగ యువతి తన ఇంటి ముందు పనిలో నిమగ్నమై ఉండగా అదే గ్రామానికి చెందిన హనుమంతుల సర్వేశ్వరావు (45) అనే కామాంధుడు అమాయక గిరిజన మూగ యువతిని తన ద్విచక్ర వాహనంపై సమీపంలో ఉన్న
అడవిలో కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు అని సమాచారం. ఇంటి ముందు కనపడని అమాయక గిరిజన మూగ యువతి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు సమీప పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయం గడిచాక హనుమంతుల సర్వేశ్వరావు అదే ద్విచక్ర వాహనం పై గిరిజన మూగ యువతి నీ తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు వదిలేశాడు. అనుమానం వచ్చి ఆరా తీయగా హనుమంతుల సర్వేశ్వరావు అత్యాచారం చేసినట్లు మూగ యువతి సైగలతో కుటుంబ సభ్యులకు తెలియజేసింది.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందజేశారు.
పోలీస్ అధికారి కి సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే పోలీసులు వచ్చి వివరాలు తెలుసుకొని హనుమంతుల సర్వేశ్వరావు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. కాగా, ఇదే గ్రామంలో హనుమంతుల సర్వేశ్వరావు వేరే యువతులపై ఐదు సార్లు అత్యాచారం చేశాడని స్థానికులు ఆరోపించారు. హనుమంతుల సర్వేశ్వరావు పెద్ద సైకో అని వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకొని గిరిజన మూగ యువతికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.