గీతన్న బంధు పథకాన్ని వెంటనే ప్రకటించాలి..

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వి రమణ

 

కేసముద్రం జనం సాక్షి / శుక్రవారం రోజున మండల కేంద్రం లోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి హరిహర గార్డెన్ వరకు కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం హరిహర గార్డెన్ లో నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా ద్వితీయ మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వి రమణ పాల్గొని మాట్లాడుతూ…గీతన్న బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న అధ్యక్షతన కొనసాగించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న,ఆహ్వాన కమిటీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్,మండల అధ్యక్షులు బబ్బూరి ఉప్పలయ్య, కార్యదర్శి మోడం వెంకటయ్య,సొసైటీ చైర్మన్ దీకొండ వెంకన్న,బండారు వెంకన్న,మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ,మానుకోట ప్రసాద్, గోపా మండల అధ్యక్షులు కూటికంటి మధు,శ్రీను, జగన్, మోడం వెంకన్న, వీరస్వామి, అంజయ్య, సోమన్న తదితరులు పాల్గొన్నారు.