గుండా మల్లేష్ సేవలు చిర స్మరణీయం!

. గుండా మల్లేష్ సేవలు చిర స్మరణీయమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు.శుక్రవారం ‌ అమరజీవి ‌ కామ్రేడ్ గుండ మల్లేష్ 3 వ
వర్ధంతిని‌ మందమర్రి ఏఐటియుసి కార్యాలయంలో ‌ మధ్యాహ్నం 12 గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రమంలో సిపిఐ ‌ జిల్లా కార్యవర్గ సభ్యులు ‌ భీమనాథుని సుదర్శనం.
మందమర్రి సిపిఐ పట్టణ కార్యదర్శి ‌ కామెరా దుర్గారాజు లు పాల్గొని ప్రసంగించారు. కామ్రేడ్ మల్లేష్ నాలుగు దపాలుగా ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ పక్ష నేతగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొని ఢిల్లీలో తెలంగాణ కోసం శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడంలో గణనీయమైన పాత్ర వహించారు. కామ్రేడ్ గుండా మల్లేష్ విద్యార్థి ఉద్యమం నుండి
యువజన ఉద్యమంలో పాల్గొని సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు పాల్గొని జైలు జీవితం గడిపిన మహనీయుడు
సింగరేణి కార్మికుల ఉద్యమంలో పాల్గొని కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి
భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల కోసం
అలుపెరుగని పోరాటం చేసిన త్యాగశీలి కోల్పోవడం బాధాకరం అన్నారు కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయాలను పునికి పుచ్చుకొని పార్టీ ప్రజా సంఘాలు పని వేయాలి అని అన్నారు.
ఉన్న మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాయబారపు వెంకన్న. పార్టీ సహాయ కార్యదర్శి బండారి రాజేశం.
ఎండి రసూల్. ఓం నారాయణ. తాళ్ల పెళ్లి వీరన్న. కొప్పుల సంజీవ్.
నాంపెల్లి. తదితరులు పాల్గొన్నారు.