గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి

హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సురానా (65) అనే ఖైదీ 2010లో అత్యాచారం, హత్య కేసులో నిందితుడు. న్యాయస్థానం ఆయనకు జీవితఖైదు విధించింది. సురానా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి ఒకటో నంబరు కృష్ణా బ్యారక్‌లో గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు సురానాను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఖైదీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.