గుజరాత్‌లో బిజెపిని ఆత్మరక్షణలో పడేసిన రాహుల్‌

మారిన శైలితో కమలదళంలో వణుకుపుట్టిస్తున్న యువనేత

గాంధీనగర్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ ఓడిపోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తీరు కమళదలానికి కునుకు పట్టనీయడం లేదు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నడూ లేనివిధంగా గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించి మోడీ ద్వయానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రధానంగా వివిధ వర్గాలను చేరదీసి బిజెపికి ఎసరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్‌లో ఓడిస్తే ఇక మోడీ పని అయిపోయినట్లే అన్న రీతిలో అక్కడ ప్రచారం సాగుతోంది. దీనికితోడు అక్కడ పటేల్‌ వర్గీయులతో పాటు వివిధ వ్యాపారవర్గాలల్లో ఆలోచనలు రేకెత్తించారు. ప్రధానంగా జిఎస్టీ దెబ్బతో వ్యాపారవర్గం మోడీకి వ్యతిరేక వర్గంగా తయారయ్యింది. గుజరాత్‌లో ఇప్పుడు మాటల వర్షం కురుస్తుంది అన్న ఒకేఒక ట్వీట్‌తో రాహుల్‌ మోడీ ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపగలిగారు. శివసేన ఎంపి ఒకరు రాహుల్‌ను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా మోడీ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్‌ చేసింది. ఇదంతా మోడీ పాలన తీరుకు అద్దంపట్టేదిగానే ఉంది. ఇప్పుడక్కడ బిజెపి మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ అద్భుత విజయాలు సాధించబోతున్నట్టు కొన్ని సంస్థల సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అయినా మోడీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో విజయానికి బీజేపీ ఎంతగా శ్రమిస్తున్నదో, ఎన్ని కష్టాలు పడుతున్నదో చూసిన తరువాత విజయంవిూద కమలనాధులకే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా రాహుల్‌ నాయకత్వంపై మళ్లీ ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు రాహుల్‌ సరైన నాయకుడన్న రీతిలో గుజరాత్‌ ప్రచారం సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌వైపు కన్నెత్తిచూడని

నరేంద్రమోదీ ఇప్పుడు తానే ముఖ్యమంత్రి అయినట్టుగా హడావుడి పడుతున్నారు. ఆ మేరకు ప్రచార షెడ్యూల్‌ పెట్టుకుని సాగుతున్నారు. బుద్ధివికసించని పిల్ల రాహుల్‌ అన్న విమర్శలు మూటగట్టుకున్న యువనేత నిజంగానే గుజరీత్‌లో పాగావేయబోతున్నాడా అన్న వణుకు పుట్టిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా అధికారం లేని కాంగ్రెస్‌ అక్కడ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నది. శంకర్‌సిన్హ్‌ వాఘేలా నిష్కమ్రణతో కాంగ్రెస్‌ మరింత కునారిల్లింది. బీజేపీ ఎంతో ముందుచూపుతో ఇలాంటి పనులు చేసినా, రాహుల్‌ పట్ల పెరిగిన ప్రజాదరణ అధికారపక్షాన్ని వణికిస్తోంది. దీనికితోడు రాహుల్‌ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. నరేంద్రమోదీకి స్వరాష్ట్రంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగలాలని విపక్ష శివసేన కూడా కోరుకోవడం చూస్తుంటే ఎంతగా మోడీ విధానాలతో ప్రజలు విసిగి పోయారో అర్థం చేసుకోవచ్చు. నిన్నమొన్నటి సర్వేల వరకూ అన్నీ బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని చెబుతుంటే నాయకుల వ్యవహార శైలిలో ఆత్మవిశ్వాసం కాక అపనమ్మకం మొదలయ్యింది. సర్వేలను నమ్మడం లేదు. ఇప్పుడు విపక్ష కాంగ్రెస్‌ అక్కడ కులం లెక్కన నేతలను ఎగరేసుకుపోతోంది. రాజ్యసభ ఎన్నికల్లో దెబ్బతిన్న తరవాత రాహుల్‌ ఎందుకనో రెచ్చిపోయిన పులిలా విజ్ఞతతో సాగుఉతన్న తీరు విశ్లేషకులనపు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాటీదార్‌ హార్దిక్‌కును దగ్గరకు చేర్చుకోవడం ద్వారా పటేళ్ళలో కాకపుట్టించారు. ఊనా ఘటన ఆదిగా దళితులపై సాగుతున్న దాడులకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన జిగ్నేష్‌ మేవానీ వంటివారి ఓట్లను బీజేపీకి పడయన్న భ్రమ కల్పించారు. ఓబీసీ నాయకుడు అల్పేష్‌ ఓట్లను నిలువుగా చీల్చేయగలరా? ఈ ముగ్గురినీ రాహుల్‌ రహస్యంగా అక్కున చేర్చుకున్న తీరుతో ఇప్పుడు అమిత్‌షా కలవరానికి గురవు తున్నారు. ఇకపోతే ఎన్నికల హిమాచల్‌ ఎన్నికల పక్రియ ప్రకటించి, ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చి, గుజరాత్‌ తేదీలను మాత్రం ప్రకటించకుండా తాత్సారం చేయడంతో వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. ఇదంతా మోడీ చేయిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘం భిన్నంగా వ్యవహరించడంతో అది అధికార పక్షంతో మిలాఖత్‌ అయిందన్న విమర్శ తప్పలేదు. గుజరాత్‌లో నరేంద్రమోదీ మరిన్ని వరాలు ప్రకటించడానికి ఈసీ వెసులుబాటు ఇచ్చిందన్న విమర్శతో పాటు, బీజేపీ అక్కడ బలహీనంగా ఉన్నదన్న వాదన పెంచడానికి ఉపకరించింది. బుల్లెట్‌రైళ్ళు, నర్మదా ప్రాజెక్టు ఆరంభాలు, జీఎస్టీ మార్పుచేర్పులు, బంగారు మినహాయింపులు చేప్టటినా అక్కడి వాతావరణాన్ని అనుకూలంగా మార్చలేదని మోడీకి తెలిసి వస్తోంది. దీనికితోడు రాహుల్‌ సభలకు జనం పెద్ద ఎత్తున హాజరుకావడం, మారిన మాటతీరుతో రాహుల్‌ వారిని ఆకట్టుకోగలగడం, బీజేపీ దారిలోనే కాంగ్రెస్‌ సోషల్‌విూడియాను ఆయుధంగా వాడుకోవడం వంటి చర్యలు కూడా బిజెపికి వ్యతిరేకతను సృష్టిస్తోంది. గుజరాత్‌లో ఇలా బీజేపీ వ్యతిరేకతను సృష్టించడం ద్వారా అధికారపక్షంలో రాహుల్‌ వేడిపుట్టించగలిగారు. పాటీదార్లు, ఓబీసీలు, దళితుల నుంచి ముగ్గురు నాయకులను కలుపుకొని బీజేపీని భయపెట్టగలిగారు. ఇప్పటివరకూ మోదీ సాధించిన విజయాలు వేరు, గుజరాత్‌ వేరు. ఈశాన్యం సహా అనేకచోట్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికారాన్ని కొల్లగొట్టిన మోడీకి గుజరాత్‌ ఎన్‌ఇనకలు అంత ఈజీ కాదని రాహుల్‌ తేల్చేశారు. ఇప్పుడు తన కోటను రక్షించుకొని తన ప్రభ ఏమాత్రం తగ్గలేదని రుజువు చేసుకునేలా ఆత్మరక్షణలో పడేశారు.