గుజరాత్ కేడర్‌కే ప్రాధాన్యం
గుజరాత్ చుట్టూ అభివృద్ది ప్రణాళికలు
మోడీ తీరుపై సర్వత్రా విమర్శలు
న్యూఢిల్లీ,నవంబర్2(జనంసాక్షి): నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో గుజరాత్‌కు మినహా మిగతా రాష్ట్రాలకు పెద్దగా చేసిందేమి లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాలలకు ప్యాకేజీలు ప్రకటించడం మినహా చేసింది శూన్యం. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పట్ల తీవ్ర
వ్యతిరేక రావడానికి ఇదే కారణం. ఈ రెండు రాష్ట్రాలకు పెద్గా ఒరగబెట్టిందేవిూ లేదు. విదేశీ పెట్టుబడులు, ఇతరత్రా ప్రతిపాదనలు ఏమి వచ్చినా ఆయన గుజరాత్‌నే సూచిస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గుజరాత్ కేడర్ అధికారులను అన్ని స్థానాల్లో నింపి అభాసులపాలయ్యారు. ఇటీవలి సిబిఐ వ్యవహారం, ఆర్‌బిఐ వ్యవహారంతో ప్రతిష్ట మసకబారింది. నరేంద్రమోదీ వ్యవహారశైలిని దగ్గర నుంచి గమనిస్తున్న పలువురు అధికారులు కూడా ఆయన గుజరాత్‌కు మాత్రమే ప్రధానమంత్రినని భావిస్తున్నారనీ, భారతదేశానికి ప్రధానినని ఆయన అనుకోవడం లేదనీ వ్యాఖ్యానిస్తున్నారు. ఆదానీ, అంబానీలకు లబ్ది చేకూరేలా, వారు సూచింన మేరకు ఆర్థిక చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. చివరకు రాఫెల్ ఒప్పందంలో కూడా రిలయన్స్ ప్రమేయం ఉందన్న విమర్శ ఉంది. నరేంద్రమోదీపై ఎన్నో ఆశలతో 2014లో దేశప్రజలు ఆయనకు పట్టంకట్టారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక అంటే మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక గిట్టని నాయకులను జైలుకు పంపడానికేనా? అన్న విమర్శలు కూడా బయలు దేరాయి. దేశ చరిత్రలో ఇటువంటి ధోరణి ఇప్పుడే చూస్తున్నాం. తమను ధిక్కరించే ముఖ్యమంత్రులను, నాయకులను జైళ్లకు పంపడం కోసమే ప్రధానమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని విమర్శలు పెరిగాయి. బీజేపీ విధానాలతో విభేదించే విూడియా సంస్థలకు కూడా హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి సంస్థలు ఉన్నది ఇందుకేనా? ప్రజాస్వామ్య వ్యవస్థలో భయపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం వాంఛనీయం, సమర్థనీయం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వచ్చే ఎన్నికలలో మళ్లీ గెలుస్తారో లేదో గ్యారంటీ లేదు. ఇతర దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు వచ్చినా వారిని కూడా నరేంద్రమోదీ గుజరాత్‌కు మాత్రమే తీసుకు వెళుతున్నారు. గుజరాత్ ఎన్నికల ము/హదు దీనిని ప్రత్యక్షంగా చూశాం. బుల్లెట్ రైలు వంటి పథకాలను ఎన్నికల ప్రణాళిక కింద మార్చేశారు. తాజాగా అహ్మదాబాద్‌లో భారీ విమానాశ్రయం నిర్మించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ నిధులతో ఢిల్లీ- అహ్మదాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ కారిడార్ మధ్యలో 50 టౌన్‌షిప్‌లు కూడా నిర్మించబోతున్నారు. గుజరాతీయులకు ముంబాయితో సంబంధాలు ఎక్కువ కనుక ఇప్పుడు ముంబాయిలో కూడా మరో భారీ విమానాశ్రయ నిర్మాణానికి పూనుకున్నారు.