గుజరాత్ గజ గజ
– ఆందోళనలు హింసాత్మకం
– పలు చోట్ల కర్ఫ్యూ
– ఆరుగురు మృతి
– ఇంటర్నెట్ నిలిపివేత
అహ్మదాబాద్, ఆగస్ట్ 26 (జనంసాక్షి):
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైన పటేళ్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. పాలన్‌పూర్ తాలుకాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై ఆందోళనకారులు దాడులు చేశారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్‌లో పటేళ్ల ఆందోళనల నేపథ్యంలో 5వేల పారామిలటరీ బలగాలు మోహరించాయి. మరోవైపు గుజరాత్ పరిస్థితిపై కేంద్ర ¬ంశాఖ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. తమను ఓబీసీలో చేర్చాలని పటేళ్లు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. పటేల్ కులస్థులను ఓబీసీల్లో చేర్చాలంటూ , ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో బంద్, కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావని, గొడవలు, ఆందోళనల వల్ల ఎవరికీ లాభం లేదని, శాంతి నెలకొనేందుకు అందరూ కృషిచేయాలని తన ట్విట్టర్ ద్వారా గుజరాత్ ప్రజలను కోరారు. అందరూ సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వైపు బంద్ కొనసాగుతుంది.. మరో వైపు ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత వాతావరణ నెలకొల్పండని మోడీ సూచించారు. గుజరాత్‌లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో కూడా కర్ప్యూ విధించడం విశేషం.దాంతో మొత్తం అంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. వదోదర, సూరత్ వంటి నగరాలలో సైతం కర్ప్యూ విధించవలసి రావడం విశేషమే. పటేల్ వర్గ నేత హర్దిక్ పటేల్ ను అరెస్టు చేయడంతో గుజరాత్ అంతా అట్టుడికిపోయింది. పలు చోట్ల రాత్రి విద్వంసం చోటు చేసుకుంది. దాంతో వెంటనే అతనిని విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మరికొందరితో కలిసి దీక్షకు దిగారు. బంద్ కు పిలుపు ఇవ్వడంతో హింస కూడా జరిగింది.