గుట్టలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

5

యాదగిరిగుట్ట,జులై5(జనంసాక్షి): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో గీత, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతి సువర్ణ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించారు. మహామండపంలో వేద పండితుల మంత్ర పఠనాల మధ్య అర్చకులు రాష్ట్రపతిని ఆశీర్వదించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీస్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేసి పాదాభివందనం చేశారు. రాష్ట్రపతి వెంట ఉమ్మడి రాష్గాల గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.