గుట్ట పనులు వేగవంతం చేయండి
– లక్ష్మీనరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
నల్లగొండ,మార్చి17(జనంసాక్షి): యాదాద్రిలో జరుగుతున్న బ్ర¬్మత్సవాల్లో భాగంగా యాదగిరి పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా గురువారం సందర్శించారు. బ్ర¬్మత్సవాల సందర్భంగా రాత్రి జరిగే కల్యాణోత్సవానికి ముందస్తుగా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. హెలీప్యాడ్ నుంచి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టువస్త్రాలతో స్వయంభూవులను ఆరాధించిన ముఖ్యమంత్రి వాటిని ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు వేదమంత్ర పఠనాల మధ్య శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులను అందజేశారు. అలంకారోత్సవాల్లో భాగంగా రామావతారాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట మనమడు, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత, ఎంపీ నరసయ్యగౌడ్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ దుగ్గల్, జడ్పీ ఛైర్మన్ బాలునాయక్, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, ఎంపీ బూర నరసయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. ఆలయ ఈవో ఎం.గీత, ధర్మకర్త నరసింహమూర్తి సీఎం దంపతులకు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా స్వామివారి ప్రతిమను సీఎం దంపతులకు అందజేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ రాత్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.




