గురడి సంఘం భవనంకు రూ.25 లక్షల మంజూరు
జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-30
ఆర్మూర్ మండలంలోని అర్ధుల్ శివారులో నిర్మిస్తున్న నిజామాబాద్ జిల్లా గురడి రెడ్డి సంఘ భవనానికి రూ ఇరవై ఐదు లక్షల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్
ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శనివారం కోరారు. దీనికి వారు స్పందిస్తూ రూ. 25 లక్షల నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్ ను నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర్ కి ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూ సీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.