గుర్తుకు వస్తున్న డబుల్ డెక్కర్ల షాన్
మల్లీ నడిపే ఆలోచన పరిశీలిస్తామన్న కెటిఆర్
నెటిజన్ ప్రశ్నకు మంత్రి పువ్వాడకు తెలిపిన మంత్రి
హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి): ఒకప్పుడు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు షాన్‌గా ఉండేవి. నగరానికి అవి ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి. తాజాగా షాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అప్జల్‌గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ విూదుగా సికింద్రాబాద్ వరకు బస్సులు తిరిగేవని, ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్ చేశారు.దీనిపై స్పందించిన కేటీఆర్.. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని, వాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అయితే ఆ బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని, మళ్లీ హైదారాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం? ఏమైనా ఉందా అని రవాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్ సూచించారు.