గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

కడప, జూలై 29 : రైల్వేకోడూరు పట్టణంలోని పాతబస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పొరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై హేమసుందరరావు చెప్పారు. కడప పాతబస్టాండ్‌లోని దేవాలయం వెనకభాగాన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లామన్నారు. ఆత్మహత్యకు పాల్పడి దాదాపు 24 గంటలు దాటి ఉంటుందని చెప్పారు. మృతుడు జీన్స్‌పాయింట్‌, నీలిరంగు గళ్లచొక్క ధరించి ఉన్నాడని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.