గుర్తు తెలియని మృతదేహం లభ్యం

 

ముడోపట్టణ పోలిసుస్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది. హేమచంద్రాపురం సమీపంలోని రైలుపట్టాలకు కోంత దూరంలో దిగంబరిగా ఉన్న మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలిసులు అక్కడికి చేరుకున్నారు. అ మృతదేహం వద్ద ఎలాంటి అధారాలు లభించలేదని పోలిసులు పెర్కోంటున్నారు. అక్కడి పరిస్థితులు,శవం ఉన్న తీరును బట్టి యాచకుడు అయి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలిసులు తెలుపుతున్నారు.