గూగుల్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ నియామకం.
అంతర్జాతీయ స్థాయిలో మరో భారతీయుడు అగ్ర స్థాయికి చేరుకున్నాడు. భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆల్ఫాబెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.
ఆయన 1972లో చెన్నైలో జన్మించారు. ఆయన ఐఐటీ – ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టాను పొందారు. అనంతరం ఆయన 2004లో గూగుల్ సంస్థలో చేరారు.
ఇంటర్నెట్ సెర్చింజన్‌గా సేవలను ప్రారంభించిన గూగుల్, ఆపై డ్రోన్ల తయారీ, ఫార్మా, వెంచర్ కాపిటల్ ఇలా పలు రంగాలకు విస్తరించింది. తాజాగా కొత్తగా వినూత్న ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేసే నిమిత్తం గూగుల్ అల్ఫాబేట్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సుందర్ పిచాయ్ సీఈవోగా ఉంటారు. ఆయనకు గూగుల్
ఫౌండర్స్ లారీ పేజ్, సీర్జీ బ్రిన్ సుందర్ పిచాయ్‌కు సీఈవోగా బాధ్యతలను అప్పగించారు.