గూడూరు ఆశ్రమ పాఠశాలలో పుఢ్ పాయిజన్
36మంది విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్,జూలై29(జనంసాక్షి ): బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన మరవకముందే మహబూబాబాద్ జిల్లాలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. గూడూరులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. విద్యార్థులను వెంటనే మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వానపాము పడ్డ పప్పు, కిచిడి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాª`డ్గంªన్ పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ రావాలంటూ ఆందోళన చేపట్టారు. గూడూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు స్పందించారు. వాª`డ్గంªన్ స్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్, విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్నారు.