గృహిణి ముఖంపై స్ర్పే చల్లి స్నాచింగ్
హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్: హెల్మెట్ ధరించిన గుర్తుతెలియని దుండగుడు గృహిణి ముఖంపై స్ర్పే కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సరూర్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ, మమత(20)కు ఐదు నెలల క్రితం వివాహం అయింది. సరూర్‌నగర్ పాత పోస్టాఫీస్ చౌరస్తా సమీపంలో నివసిస్తున్నారు.రాధాకృష్ణ మినరల్ వాటర్‌ప్లాంట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా.. మమత ఇంటి వద్దనే ఉంటోంది. అతడు సోమవారం విధులకు వెళ్లగా.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. గుర్తుతెలియని వ్యక్తి తలుపు కొట్టగా మమత తీసింది. హెల్మెట్ ధరించిన అతడు తనతో తెచ్చుకున్న యాక్స్ డియో బాడీ స్ర్పేను ఆమె ముఖంపై చల్లి మమత మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కున్నాడు. ఆందోళనకు గురైన ఆమె తేరుకుని కిటికీలోంచి పక్కింటి వారిని పిలిచేలోపు దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. నిందితుడు స్ర్పే బాటిల్‌ను, చెప్పులను అక్కడి మరిచిపోయాడు. అతడు తీసుకొచ్చిన కూరగాయలు కోసే కత్తి, మంకీ క్యాప్ ఘటనా స్థలంలో పడిపోయాయి. సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ లింగయ్య, డీఐ మన్మోహన్ అక్కడి చేరుకుని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.