గెలిచిన ‘చిల్లర’ బిల్లు
న్యూఢిల్లీ,డిసెంబర్5 (జనంసాక్షి) : సుదీర్ఘ చర్చ, విమర్శలు ప్రతివి మర్శలు మధ్య రెండు రోజులుగా సాగిన చర్చ అనంతరం ఎఫ్‌డీఐల పై ప్రభుత్వానికి విజయం దక్కింది. ఎస్పీ, బిఎస్పీ వాకౌట్ చేయడం, తెలంగాన కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్‌లో
గట్టెక్కింది. ఇక మన దేశంలో వాల్‌మార్ట్‌లు స్వేచ్ఛగా వానిజ్యం చేసుకునేందుకు ఎర్రతివాచీ పరిచి నట్లయ్యింది. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై స్పీకర్ విూరాకుమార్ ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 218 ఓట్లు రాగా వ్యతిరేకంగా 253 ఓట్లు వచ్చాయి. దీంతో ఎఫ్‌డీఐలపై విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయినట్లయింది. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 471 మంది సభ్యులున్నారు.ఎఫ్‌డీఐలకు అనుకూలంగా యూపీఏ కూటమిలోని కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, ఇతరులు, రాష్టీయ్ర జనతాదళ్‌లు ఓటువేశాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఎన్డీయే కూటమిలోని భాజపా,జనతాదళ్‌లతో పాటు వామపక్షాలు, తృణమూల్‌కాంగ్రెస్, బిజూజనతాదళ్, అన్నాడీఎంకే, తెలుగుదేశం, తెరాస … తదితరులు ఓటు వేశారు.ఓటింగ్‌ను సమాజ్‌వాదీపార్టీ, బహుజనసమాజ్‌పార్టీలు బహిష్కరించడంతో యూపీఏ సర్కారు గెలవగలిగింది.
22 మంది సభ్యులు గల ఎస్పీ 22 మంది సభ్యులు, 21 మంది సభ్యులు గల బిఎస్పీ సభ నుంచి వాకౌట్ చేసి, వోటింగులో పాల్గొనలేదు. దీంతో యుపిఎ ప్రభుత్వం నెగ్గింది. వోటింగులో 471 మంది సభ్యులు పాల్గొన్నారు. దీంతో లోకసభలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి ఊరట లభించింది. 21 మంది సభ్యులు గల బిఎస్పీ వాకౌట్ చేయడంతో యుపిఎకు ఊరట లభించింది. ఓటింగులో పాల్గొనకూడదని ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీకి 22 మంది సభ్యులున్నారు. దీంతో ఓటింగుకు ముందే యుపిఎ ప్రభుత్వానికి ఊరట లభించింది.ఎఫ్‌డిఐలపై ఎటు ఉంటామనే విషయాన్ని బిఎస్పీ నేత మాయావతి చివరకు వరకు తేల్చలేదు. ఎస్పీ, బిఎస్పీలకు చెందిన 43 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఓటింగులో పాల్గొనకూడదని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు.ఎఫ్‌డిఐలపై అన్ని పక్షాల వాదనలు విన్నామని, రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదని ఆనంద శర్మ అన్నారు. ఎఫ్‌డిఐలపై అభిప్రాయాలు చెప్పాలని రాష్టాల్రను అడిగామని, 21 రాష్టాల్రు అభిప్రాయాలు తెలిపాయని, గుజరాత్, పంజాబ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పలేదని ఆయన అన్నారు.కేంద్ర నిర్ణయాలను రాష్టాల్రపై బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. బహుళ జాతి సంస్థలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అనుమతించబోమని, ఆ సంస్ఠల పెట్టుబడులను ఎఫ్‌ఐపిబీ నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో తీవ్ర కొరత ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల్లో వృధాను బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. విదేశీ సంస్థలు భారత్‌లో, మన సంస్థలు విదేశాల్లో అమ్ముకోవడానికి వీలు ఉంటుందని అన్నారు. వ్యాపారం చేసే వాటిలో వాల్‌మార్ట్ ఒక్కటే లేదని ఆయన అన్నారు. ఎఫ్‌డిఐలను 18 పార్టీల్లో 14 పార్టీలు
వ్యతిరేకిస్తున్నాయని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్నా ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అలాగే ఏకాభిప్రాయసాధనకు యూపిఎ కృషి చేయలేదన్నారు.