గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక…

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజశేఖర్
కేసముద్రం అక్టోబర్ 12 జనం సాక్షి / ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేసే అతిధి అధ్యాపకుల సంఘం 1145 యూనియన్ మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రం కు చెందిన గడ్డం రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూటికంటి మధు గౌడ్ తెలిపారు.కమిటీ లో భాగంగా ప్రధాన కార్యదర్శి ధర్మారపు సదాకర్ జి.జె.సి.గర్ల్స్ మహబూబాబాద్,కోశాధికారి గోవిందు సుధాకర్ జి.జె.సి బాయ్స్ మహబూబాబాద్, ఉపాధ్యక్షులు లింగంపల్లి దయానంద్,సాహితీ శ్రీనివాస్,మహిళా కార్యదర్శి సృజన,ప్రచార కార్యదర్శి హనుమ,సంయుక్త కార్యదర్శులుగా యాకుబ్,రాజేష్,అనిత,విజయ్ కుమార్,కార్యవర్గ సభ్యులు గా తిరుపతి,స్రవంతి,నాగేశ్వర్ రావు,స్పందన,నరేందర్,జులిఫికర్ అలీ,రాజు,శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు  రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల లో అడ్మిషన్ల పెంపు కొరకు,ర్యాంకులు సాధించటం లో మరియు కళాశాల అభివృద్ధికి మన బాధ్యతగా గెస్ట్ లెక్చరర్ లు ప్రధాన పాత్ర పోషించాలని,గెస్ట్ లెక్చరర్ ల సమస్యలను ఎప్పడికప్పుడు గౌరవ అధ్యక్షులు డా.మధు సుధన్ రెడ్డి దృష్టికి, రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ పాషా దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారనికి కృషి చేస్తూ సంఘం బలోపితానికి కృషి చేస్తానని అన్నారు.నూతన కమిటీ ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి గన్నోజు రాంప్రసాద్, జిల్లా గౌరవ అధ్యక్షులు యెర నారాయణ పాల్గొన్నారు.