గొటబయి గో బ్యాక్‌ అంటూ నినాదాలు

మాల్దీవుల్లో శ్రీలంక వాసుల నిరసనలు

మాలె,జూలై14(జనం సాక్షి

Gotabaya Rajapaksa

:శ్రీలంకను వీడి మాల్దీవులకు చేరిన రాజపక్సేకు నిరసన సెగ ఎదురైంది. శ్రీలంక వాసులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గొటబాయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొటబాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సింగపూర్‌ వెళ్లేందుకు ప్రైవేట్‌ జెట్‌ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఆయన ఇంకా రాజీనామా చేయలేదని స్పీకర్‌ అబేవర్దనే వెల్లడిరచారు. జూలై 20వ తేదీన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం గొటబాయ రాజపక్సే కుటుంబమే కారణమని పేర్కొంటూ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆందోళనలను ఉధృతం చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన నిరసన కారులు అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాజపక్సే శ్రీలంకను వీడారు. రాజీనామా సమర్పించకుండానే మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారు. అనంతరం శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. ఆయన అనుచరుడైన రణిల్‌ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక మాల్దీవులకు రాజపక్సే చేరుకున్నారని విషయం తెలుసుకున్న శ్రీలంక వాసులు ’గో హోమ్‌ గొట’ అంటూ ప్ల కార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. మరి ఆయన సింగపూర్‌ కు వెళ్లారా లేదా అనేది తెలియరాలేదు.