గోదావరిలో పుణ్యస్నానాలు

 

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ధర్మపురి/బాసర,జనవరి14(జ‌నంసాక్షి ) : పుష్య మాసం సందర్భంగా వద్ద గోదావరిలో అధిక సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సంక్రమణ ప్రవేశం జరుగుతున్న వేళ ఉదయం నుంచి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి,మంథని, బాసరలో ప్రత్యేకంగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ధర్మపురి దేవస్థానంలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలో వేద పండితులు, అర్చకులు పంచోపనిత్తుపూర్వకంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహ ¬మాన్ని, నిత్య కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం సప్తమి పుష్యమాసం పవిత్ర గోదావరిలో స్నానాలను ఆచరించడం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరి స్నానాలు ఆచరించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు, బ్రాహ్మణోత్తములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాసరలో కూడా సోమవారం వేకువజామున గోదావరి స్నానాలు ఆచరించి తర్పణాలు వదిలారు. అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది.

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. సంక్రాంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు దీపారాధన పూజలు చేపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభాత వేళ బాలాలయంలో ఆచార్యులు ఆండాళ్‌ అమ్మవారిని ఆరాధిస్తూ తిరుప్పావై పాశుర పఠనం జరిపారు. కల్యాణ మండపంలో గోదాదేవిని పెళ్లి కూతురిగా దివ్యమనోహరంగా అలంకరించి వేడుకలు చేపట్టారు. గర్భాలయంలో మూలవరులకు ఆరాధనలు చేపట్టిన పూజారులు బాలాలయంలోని కవచమూర్తులను హారతితో కొలిచారు. లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణోత్సవ పర్వాలను నిర్వహించారు. వరుస సెలవుఉల కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.