గోదావరి జలాలతో చెరువులు నింపుతాం
నాలుగేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలు
కాంగ్రెస్ పార్టీకి విమర్శలు తప్ప మరోటి తెలియదు: ఎర్రబెల్లి
జనగామ,ఆగస్ట్4(జనం సాక్షి): గోదావరి జలాలతో చెరువులు నింపుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హావిూ ఇచ్చారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానన్నారు. దేవాదుల నీళ్ల కోసం సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.300కోట్లను మంజూరు చేశానన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆయన ధ్వజమెత్తారు.సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అభివృద్థిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల పాలనలోనే రాష్ట్రం రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పేదలకు వరమన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి నియోజకవర్గంలోని ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇలా పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.మిషన్ కాకతీయతో చెరువులో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మోడల్ స్కూల్ మంజూరు చేశానని గుర్తు చేశారు. ఇకపోతే /ూష్ట్రాన్ని ఆకు పచ్చ తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందరూ మొక్కలు నాటి పాలకుర్తి నియజకవర్గంలో పచ్చదనం ఉట్టిపడాలన్నారు. మొక్కలు నాటడడమే కాకుండా వాటిని సంరంక్షించుకోవాలన్నారు.